Posts

Showing posts from May, 2018

చూపుడు వేలు. కవిత

విరించి ll చూపుడు వేలు ll ---------------------------------------- ఇదేమీ పిడికిళ్ల వ్యవసాయం కాదు సూర్యుడు మనం మొలకెత్తమన్న చోటల్లా మొలకెత్తడు కలం పారించేది ఎంతకైనా రక్తం కాకూడదు కానీ పదం చేతబట్టుకున్న తొందరలో పదం హృదయానికి తట్టుకున్న ఆనందంలో నీకు తెలియకుండానే ఎంతెంత దూరం పాకాలని చూశావో.. ఎందరెందరి ఆకలి పేగులను ఉరికొయ్యకు అర్పించాలని అనుకున్నావో.. తమ్ముడా ఇదే అరణ్యం. దండనల అరణ్యం. క్రూరజంతువులు మనుషులు రూపంలో సంచరించే జనారణ్యం చేతిలో పదమున్నవాడు గొంతులో గేయమున్నవాడు డప్పుల మోతలతో హూరెత్తించాల్సిన దివ్య స్థానం. చెట్ల మధ్యన..పుట్ల మధ్యన నిప్పులు వేసి మహూగ్రంగా పుట్టించే దావానలానికి బూడిద తప్ప మరో ఫలితం లేదు. ఇప్పుడు నిప్పులు కాదు ఆలోచనలు కావాలి. అడవినిప్పులు ఇక్కడ చిప్పిల్లాలి. రాజ్యం మీద చేసే పోరాటంలో ఆకలి పోరాటాల ఊసెత్తకపోతివే ఆకలికి మసిలే వాడిలో రక్తమెంతగా మరుగుతుందో తెలిసిన వాడివి నీ పాటతో చల్లబరచలేకపోతివే.. గుండెల్లోకి తూటా దిగినంత సులువుగా మాట దిగక పోవచ్చు కానీ మాట పాటౌతది. పాట పథమోతది. పొద్దుగాల ఇన్న పాట రాత్రి దాకా వినబడుతున్నట్టు నీ పాట చెవ...

ఆరాల వాళ్ళు. కవిత

విరించి ll ఆరాల వాళ్ళు ll ------------------------------------ కమ్మని కవిత్వం నేను రాస్తానన్నాను. అందులో మా కులముందన్నారు వాళ్ళు. ఛందో బద్ద పద్యం చేస్తానన్నాను నేను. దారపు పోగులున్నాయా అని అడిగారు వాళ్ళు ఆకలిని ఇంకుతో  పేపరుపై చెక్కుతానన్నాను ఎర్రింకు వాడకూడదన్నారు వాళ్ళు. పాట పాడుతూ సాపాటు మరుస్తానన్నాను. లోలోపలనే పాడుకోమన్నారు వాళ్ళు శ్రామికుడి కండల శిల్పం చెక్కుతానన్నాను శిలలా నిలబడిపొమ్మన్నారు వాళ్ళు. విశ్వనరుణ్ణి చిత్రిక పడతానన్నాను ముఖం చిట్లించి నాదేవూరని అడిగారువాళ్ళు. చిన్నారుల నవ్వుల్లా నాట్యం చేస్తానన్నాను చీపని చీదరించుకున్నారు వాళ్ళు. కళ ఏదీ లేనపుడు బతకడం ఎందుకన్నాను నేను. చావడం మంచిదన్నారు వాళ్ళు. ఎవరు మీరంతా అడిగాను నేను కవులమన్నారు వాళ్ళు కళాకారులమన్నారు వాళ్ళు. కాళ్ళు కాలుతూ ఎడారిలో నిలబడి నేను పీఠాలమీద నీడల్లా బాసింపట్టుతో వాళ్ళు. కులమేదని మతమేదని ప్రాంతమేదని పార్టీ ఏదనే ఆరాల వాళ్ళు నిబిడాశ్ఛర్యంలో నేను. విషం కక్కుతూ వాళ్ళు. 9/5/18

మహానటి రివ్యూ

A film to satisfy and unfold our preconceived notions ------------------------------------------------------- ముందే గొప్పనటి అని ఒక అవ్యాజమైన అభిమానం. ఆపై, అక్కడా ఇక్కడా తెలుసుకున్న ముక్క ముక్కల ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆమె జీవిత చరమాంకం దారుణంగా ముగిసింది అని తెలియడంవలన ముందే ఏర్పడిన ఓ జాలి. ఈ రెండూ ముందే ఏర్పరచుకుని సగటు ప్రేక్షకుడు ఈ మహానటి సినిమాకు వెళతాడు. ఆమె తాగుడుకు బానిసై చనిపోయిందని ఇంకో ఇన్ఫర్మేషన్. కాబట్టి ఆమె ఎలా ఆ అలవాటులోకి పోయిందోననే ఉత్సుకత. ఆమె భర్త జెమినీ గణేశనే ఆమెను చంపేశాడు అనో..ఆయనే ఆవిడ చావుకు కారణమనో కూడా ఇక్కడో అక్కడో వినే వుంటాం. కాబట్టి ఆవిడ ఎలా మోసపోయిందో తెలుసుకోవాలనే కుతూహలం. ఇవన్నీ అంతో ఇంతో తెలిసిన విషయాలే. కాకపోతే వాటిని స్పష్టంగా అన్ఫోల్డ్ చేస్తూ పోవడమే ఈ సినిమా. ఈమె పర్సనల్ జీవితానికి చెందిన కథ పది మందికీ తెలియాలి అని అనుకుంటుంది ఈ కథను రాసే మధురవాణి అనే రైటర్ కం జర్నలిస్టు. వ్యక్తుల పర్సనల్ జీవితాల్లోకి తొంగిచూసి వాటిని బయట పెట్టి పత్రిక సర్క్యులేషన్ పెంచుకోవాలని చూచే పప్పరాజ్జి పత్రికలో ఈమె ఒక జర్నలిస్టు. ఇటువంటి గాసిప్ ప్రధాన పత్రికలకు ఉండే తొంగి...

సింధూరం. పుస్తకం మీద రైటప్

కార్ల్ మార్క్స్ రాసిన ఉద్గ్రంధం "ది కాపిటల్" అంత సులువుగా అర్థం కాదు. కొన్ని శతాబ్దాలు నిలబడిపోయే పుస్తకమిది. ఎందరో మేధావులు దానిని అర్థం చేసుకుని తమకు తోచిన రీతిలో వివరణ ఇవ్వగలిగారు. కానీ సీనియర్ పాత్రికేయులు వున్నం వెంకటేశ్వరులు Vunnam Venkateswarlu గారు వారి సతీమణి ఉష గారితో కలసి కాపిటల్ లోని మూల సిద్ధాంతాలను సరళమైన భాషలో "సింధూరం" పేరుతో కవిత్వం చేశారు. కాపిటల్ ను కవిత్వం చేయాలన్న ఆలోచనే కొత్తది. గొప్పది. అది కూడా అందరికీ అర్థమయ్యే సరళమైన భాషలో.... ఆ కవిత్వం ఎంతటి అద్భుతమైన వాక్యాలతో మొదలౌతుందో చూడండి. ఈ వాక్యాలు ఎంతటి సత్యాన్ని బట్టబయలు చేస్తున్నాయో ఒకసారి గమనించండి. శిలాక్షరాలుగా చెక్కు కోవాల్సిన వాక్యాలివి. " ఎక్కడైనా ఎప్పుడైనా ఆకలి చెలరేగి కేక పెట్టిందంటే అక్కడ సిరిసంపదలన్నీ బందీ అని అనుమానించు." "ఎప్పుడైనా దౌర్జన్యం పెరిగి రాజ్యమేలిందీ అంటే అప్పుడు..సంపద అహంభావం ప్రదర్శితమైందని గుర్తించు". "ఎక్కడ ఎప్పుడైనా పేదరికం సంకెలలతో ఉందీ అంటే అక్కడ శ్రమ లొంగతీతకు వెలిఆయుధమైందని తెలుసుకో". "పెట్టుబడిలో పరిమళాలు వె...

Essay. తిట్ల పురాణం

తిట్ల పురాణం. ---------------------- ఆమధ్య ఒక మిత్రుడు నన్ను బాగా బూతులు తిడుతూ కొంతకాలం కొన్ని పోస్టులు కొన్ని కామెంట్లూ పెట్టుకున్నాడు. నేను చూసి కూడా పెద్దగా స్పందించలేదు. ఇంకో మిత్రుడు..."ఆయన అలా తిట్టేస్తుంటే నిమ్మళంగా ఉన్నావేంటి?" అని అడిగాడు. "ఆయనకు నన్ను తిట్టడం లేదా నా స్థానంలో ఇంకెవరినైనా తిట్టడం ఒక మానసిక అవసరం. నాకు ఆ అవసరం లేదుగా..!" అని చెప్పాను. ఈ తిట్టే వ్యక్తికి ఎవరో ఒక శత్రువు కంపల్సరీ గా ఉండాలి. ఈ సారికి నేను. నేను కాకుంటే అతడు ఇంకో వ్యక్తిని వెతుక్కుని తిట్టడం మొదలు పెడతాడు. ఏముంటుంది ఈ తిట్టడంలో మజా అంటే...చాలానే ఉంటుందని చెప్పాలి. మనిషికి ఇంకో మనిషిని ప్రేమించడం, ప్రేమించబడడం ఎంత అవసరమో ద్వేషించడం, ద్వేషించబడటం కూడా అంతే అవసరం. మహాభారతంలో ధర్మరాజుకు అజాత శతృవని పేరు. కానీ మహాభారతం మొత్తంలో బోరింగ్  క్యారెక్టర్ ఎవరూ అంటే ధర్మరాజే అని చెప్పక తప్పదు. ఎవరినీ తిట్టకుండా పరమ సాధువు లాగా కనిపించే భర్తను ఏ భార్యా భరించలేదు గాక భరించలేదు అంటాడు ఒక సైకాలజిస్టు. నిజానికి ఎంత ద్వేషించినా...ఆ ద్వేషించబడిన వ్యక్తికి ఐదు పైసల నష్టం కూడా జరగదు. ఐతే మరెం...