మహానటి రివ్యూ
A film to satisfy and unfold our preconceived notions
-------------------------------------------------------
ముందే గొప్పనటి అని ఒక అవ్యాజమైన అభిమానం. ఆపై, అక్కడా ఇక్కడా తెలుసుకున్న ముక్క ముక్కల ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆమె జీవిత చరమాంకం దారుణంగా ముగిసింది అని తెలియడంవలన ముందే ఏర్పడిన ఓ జాలి. ఈ రెండూ ముందే ఏర్పరచుకుని సగటు ప్రేక్షకుడు ఈ మహానటి సినిమాకు వెళతాడు. ఆమె తాగుడుకు బానిసై చనిపోయిందని ఇంకో ఇన్ఫర్మేషన్. కాబట్టి ఆమె ఎలా ఆ అలవాటులోకి పోయిందోననే ఉత్సుకత. ఆమె భర్త జెమినీ గణేశనే ఆమెను చంపేశాడు అనో..ఆయనే ఆవిడ చావుకు కారణమనో కూడా ఇక్కడో అక్కడో వినే వుంటాం. కాబట్టి ఆవిడ ఎలా మోసపోయిందో తెలుసుకోవాలనే కుతూహలం. ఇవన్నీ అంతో ఇంతో తెలిసిన విషయాలే. కాకపోతే వాటిని స్పష్టంగా అన్ఫోల్డ్ చేస్తూ పోవడమే ఈ సినిమా.
ఈమె పర్సనల్ జీవితానికి చెందిన కథ పది మందికీ తెలియాలి అని అనుకుంటుంది ఈ కథను రాసే మధురవాణి అనే రైటర్ కం జర్నలిస్టు. వ్యక్తుల పర్సనల్ జీవితాల్లోకి తొంగిచూసి వాటిని బయట పెట్టి పత్రిక సర్క్యులేషన్ పెంచుకోవాలని చూచే పప్పరాజ్జి పత్రికలో ఈమె ఒక జర్నలిస్టు. ఇటువంటి గాసిప్ ప్రధాన పత్రికలకు ఉండే తొంగిచూచే బుద్ధి సగటు మనిషికి ఉంటుందా?. ఈ సినిమాకు హిట్టు టాకు వచ్చేసింది కాబట్టి...పప్పరాజ్జి బుద్ధి అందరిలో ఉన్నట్టే అనిపిస్తోంది. పత్రికలకైతే ఏదో సర్క్యులేషన్ పెరుగుతుందని ఓ కాంక్ష ఐనా ఉంటుంది. సగటు మనిషికి ఎందుకంత తహతహ?. ఏమో...స్వాతి పుస్తకంలో బాక్సు ఐటెం లాగా ప్రతీ పేజీలో వేసే గాసిప్ లు చదివి ఆనందించే వారికి కొదువ ఉండదు అని తెలుసు కాబట్టే ఈ సినిమా విజయం మీద గట్టి నమ్మకమే ఉండి ఉంటుంది మేకర్స్ కి. ప్రేక్షకుడికి వందనం.
ఇక తెలిపే విధానంలో కూడా తాడూ బొంగరంలేనట్టు సమంతా విజయ్ ల ప్రేమాయణం. మనుషులకు పక్కింటి వాడి విషయాలన్నీ కావాలి. అందునా పెద్ద హీరోయిన్ ఏమీ లేని స్థితిలో కోమాలోకి పోయిందని తెలిస్తే...? నరేష్ పాత్రధారి అంతలా "ఫీలై" ఆమె కథను బయటకు తేవాలని ఎందుకనుకున్నాడో..మనకు తెలియదు. "ఇంటి పక్కింటి వాడు కాబట్టి" అని సరిపుచ్చుకోవాలి. ఒక మహానటి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. అవేవీ లేకుండానే మహానటి ఐపోదు కదా. ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ఒక వ్యక్తి ఏ విధంగా పైకి ఎదిగింది అని ప్రశ్న వేసుకుంటే...వ్యక్తిగత జీవితానికీ ప్రొఫెషనల్ జీవితానికీ మధ్య ఉండే ఫ్రిక్షన్ ప్రత్యక్షమవ్వాలి. ఆమె మహానటి గా ఎదగటానికి చేసిన కృషి ఏంటి అనేది బయటకు రావాలి. కానీ మన పప్పరాజ్జీ మనస్తత్వాలకు అవి ఎందుకు?. ఆమె వ్యక్తిగత జీవితమే కావాలి మనకు.
ఔనూ...!అది తెలుసుకుని ఏమి చేయాలి?. ఎవరి జీవితంలో లేవు కష్టనష్టాలు?. ఉంటాయ్. కానీ తెలుగు తెరను ఏలిన మహా నటీమణి ఎంత నాశనమయ్యిందో తెలుసుకోవడంలో బహుశా సాడిస్టిక్ కిక్ ఉందేమో...మనకు ఆమె జీవితంలో ఎందుకంత ఉన్నతస్థాయి కి పోయిందో తెలుసుకునేకంటే....ఆమె ఎలా పతనం చెందిందో అనే విషయమే కావాలి. అందుకే ఓ సినిమా తీసుకుంటే పోలా?. ఏమైనా జెమినీ గణేశనే మహా ప్రేమికుడు అని చెప్పడమే ఉద్దేశమైతే ఈ సినిమాకు "మహా ప్రేమికుడు" అనే పేరు సూట్ అయ్యేది. "మీరంతా అనుకుంటున్నట్టు జెమినీ గణేశన్ ఆమె చావుకు కారకుడు కాదు...నిజానికి వాళ్ళు అమర ప్రేమికులు" అని మాత్రమే ఈ సినిమా దర్శకుడు మనకు చెప్పదలచాడు. బహుశా అదొక దృక్కోణం. నిజం అయ్యుండొచ్చు కూడా. ఐనా ఇపుడు ఒక నటి పతనాన్ని తెలుసుకోగానే ఆమె మీద ఏమైనా గౌరవం తగ్గిపోతుందా?. ఏమీ తగ్గదు. కానీ హమ్మయ్య "తెలిసిందిలే తెలిసిందిలే " అని ఓ ఆనందం. ఏ నటికైనా నటుడికైనా ఒక వ్యక్తిగత జీవితమూ ఒక నటనా జీవితమూ ఉంటాయ్. కానీ వ్యక్తిగత జీవితాన్ని గాసిప్స్ లాగా తెలిపే సోప్ బాక్సు రాతలకు దృశ్యరూపం ఈ సినిమా. ఎందుకంటే ఈ సినిమాలోని విషయాలన్నీ మన మధ్యలో గుసగుసల రూపంలో నలుగుతున్నవే. ఇపుడు ఈ సినిమా లో అన్ఫోల్డ్ చేశారంతే.
విరించి విరివింటి
11/5/18.

Comments
Post a Comment