Posts

Showing posts from September, 2017

Essay - defective thinking

డిఫెక్టివ్ థింకింగ్ డిమోనెటైజేషన్ జరిగినపుడు, ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే నల్లధనమంతా ఒక్కసారిగా బయటకు వచ్చేస్తుందని ప్రధాన మంత్రి చెప్పడం కాదు, దానిని ఔను నిజమే అని ప్రజలు నమ్మడం. ఒక్క డిమోనెటైజేషన్ విషయమే కాదు, రాజకీయ నాయకుల ప్రతీ వాగ్ధానాలను నమ్మడం చూస్తున్నపుడు మనం నమ్మిక ఏర్పరుచుకునే విధానంలోనే ఏదో లోపం ఉందనిపిస్తుంది. మనం కాపాడుకునే ఇటువంటి ప్రయత్నపూర్వక అజ్ఞానం వలననే రాజకీయ నాయకులు వారు చేసే నిర్ణయాలలోని మంచీ చెడులకంటే, మనం ఏర్పరుచుకున్న నమ్మకాలను ఆసరాగా చేసుకుంటారు. మనం అధిక శాతం ప్రజల సగటు అభిప్రాయం మీద ఆధారపడి ఒక నిర్ణయానికి వస్తూంటాం. ముఖ్యంగా ఎలక్షన్లలో ఈ సగటుతనం కనిపిస్తుంది. ఈ సారి ఎలక్షన్లలో ఎవరిని ఎన్నుకోవాలి అనే విషయంలో ఎవరు బాగా పనిచేయగలరు, ఎవరు నిజాయితీగా పాలించగలరు, ఎవరి గుణగణాలు ఏమిటి అనే అంశం కంటే అధికశాతం ప్రజలు ఎవరిని సగటున ఎన్నుకుంటారు అనే విషయం ఆధారంగా మనం అంచనాలు వేస్తుంటాం. వారికే ఓటు వేస్తాం కూడా. మెజారిటీ ప్రజలు ఈ సారి సగటున పలానా వ్యక్తి గెలుస్తాడు అనుకుంటున్నారంటే, మనం ఆ వ్యక్తి వైపే మొగ్గు చూపుతుంటాం. ఇదొక మూఢనమ్మకంలాంటి వ్యవహారం. మూఢనమ్మకం ఆచరించేటపుడు ...

Poem - nallati poolu

విరించి ll  నల్లటి పూలు   ll ------------------------ అక్షరాలెపుడూ పూవులు కాలేదు రాసుకున్న కాగితాలెపుడూ మాట్లాడనూ లేదు కానీ ఈ ఉదయం పూట పూవుల్ని గుప్పిట్లో పట్టుకుని నీతో మాట్లాడాలనుకుంటున్నాను నీలాగే మాట్లాడాలనుకుంటున్నాను. ఐనా, నీకేం తెలుస్తుంది...!! వేళ్ళ చివరన కాలాల్ని బిగబట్టుకుని కొండంత గొంతుచేసుకున్నదామె వేళ్ళ కొసటి ట్రిగ్గర్ నొక్కుల శబ్దాలు ఏ గొంతుకను ఆపగలవని? నేనిపుడు పూసుకున్నదంతా ఆ శరీరంలోంచి పొంగుకొచ్చిన నల్లటి రక్తం. ఎన్ని అసత్యాల మంటల మీద ఇరానీ ఛాయ్ లాగా మరిగిపోయిందో..ఆ రక్తం అది కాలీ కాలీ కమిలిపోయిన నిరసనల ప్రవాహం. ఇదిగో ఇక్కడెన్ని అక్షరాలు...!! ఆ రక్తం వలెనే నల్లవి. తెల్లటి కాగితాల మీద నిరసన గళాలై లేస్తవి. రంగులద్దిన వాడి ప్రతీ రంగు వెలిసి పోయేలా... ప్రతీ రంగూ ఉనికి కోల్పోయేలా అక్షరాలు నలనల్లగా మెరవాలిపుడు అరే..ప్రజాస్వామ్యమంటేనే నల్లటి ఇంకు! ప్రజలకోసం బతకడమంటే.... దానిని వేరేవాడి మీద పోసుడు కాదు. మనమీదే పోసుకునుడు నల్లటి అక్షరమై మొలకెత్తుడు ఎన్ని ముల్లులు గుచ్చుకున్నా నల్లటి పూలై విరబూసుడు రక్తానికీ ఇంకుకూ తేడా మర్చి...

Essay- Arjun Reddy- A destruction of the self

Arjun Reddy, A destruction of thè self అర్జున్ రెడ్డి ఎవరు? అని అడిగితే బహుశా ఒక్కొక్కరు ఒక్కో సమాధానం ఇస్తారు. వాడిని ఎవరు ఎలా అర్థం చేసుకుంటే అందుకు అనుగుణంగా సమాధానం రావచ్చు. ఐతే అన్నింటికంటే ఇర్రిటేటింగ్ సమాధానం, ఇట్స్ జస్ట్ ఏ ఫిల్మ్ అనడం. ఐతే ఇట్స్ జస్ట్ ఏ ఫిల్మ్ అనుకోవాల్సిన సినిమాలు మన తెలుగులోనే ఎక్కువగా ఉన్నాయి. లాజికల్ థింకింగ్ కీ, రియాలిటీకీ సంబంధం లేని తెలుగు సినిమా కథల హోరు, అర్థం లేని హీరోయిజాలు బహుశా మనలో ఇటువంటి జస్ట్ ఏ ఫిలిం అనే భావాల్ని స్థిరపరిచి ఉండవచ్చు. ఎవరైనా ఒక సినిమాని విమర్శిస్తే, ఇంత అవసరమా..ఇట్స్ జస్ట్ ఏ ఫిల్మ్ అని అనడం చూస్తూ ఉంటాం. స్లోవీనియన్ ఫిలాసఫర్ స్లావోజ్ జిజెక్ ఫిల్మ్స్ కెన్ థింక్ అంటూ సమాజంలోని ఆలోచనల ప్రతిరూపంగా సినిమాలను చూడాలని సూత్రీకరిస్తూ అద్భుత విమర్శతో అబ్బురపరుస్తూన్నపుడు, సినిమాను సినిమాలాగా చూడాలని తలా తోక లేని వాదనతో మన తెలుగు మూర్ఖ శిఖామణులు ఇట్స్ జస్ట్ ఫిలిం అంటూ ఉంటారు. ఒక గ్రూప్ ఆఫ్ థింకర్స్ ఒక ఐడియాను రిప్రెజెంట్ చేయడానికి సినిమా అనే మాధ్యమాన్ని వాడుకుంటున్నపుడు, ఇట్స్ జస్ట్ ఏ ఫిలిం అనడంలో వారి అపరిపక్వత ఏ స్థాయిలో ఉందో అర్థం చే...

Essay - kharamu palu

ఖరము పాలు ------------------------------ "గంగిగోవు పాలు గరిటెడైనను చాలు కడవెడైననేమి ఖరము పాలు" అంటాడు యోగి వేమన. పట్టెడు భక్తి కలుగు కూడు మంచిదనే ఉద్దేశంలో ఆయన ఆ పోలిక చెబుతారు. భక్తికలుగు కూడు అంటే పోషక విలువలు కలిగిన ఆహారం అనుకోవచ్చేమో. పిల్లలకు తల్లి పాలు లేకపోతే చాలా మంది ఆవు పాలను ఇవ్వమని చెబుతూంటారు. ఆవుపాలు తల్లి పాలవలెనే శ్రేష్ఠమనీ చెబుతారు. ఇంకొంత రిలీజియస్ బెంట్ ఉన్నవారు, ఆవు దైవంతో సమానమనీ, సకల దేవతలూ ఆవులోనే ఉన్నారనీ నమ్మకం కలిగి ఉంటారు. అమ్మ పాలవంటి పాలను ఆవు తప్ప ఇంకే జంతువూ అందించలేదనీ, అందుకే ఆవును అమ్మ లాగా గౌరవించాలనీ చెబుతూ ఉంటారు. కానీ, సైంటిఫిక్ రీసెర్చి ఈ భావనలకు, నమ్మకాలకూ పూర్తిగా విరుద్ధమైనటువంటి రిజల్ట్సును చూపుతోంది. తల్లి పాల తరువాత, దాదాపు అంతే శ్రేష్ఠమైన పాలు ఆవు పాలు కానే కాదు. వేమన ఏ ఖరము పాలైతే కడవడైననేమి అన్నాడో....అవే ఖరము పాలు తల్లి పాల వలెనే శ్రేష్ఠమైనవని ఆధునిక రీసెర్చి చెబుతోంది. శ్రేష్ఠత ఆధారంగా పాలను ఒక క్రమంలో అమరిస్తే....తల్లిపాలు, గాడిద పాలు, మేక పాలు, ఆ తరువాతే ఆవు పాలు. నా మిత్రుడు పేడియాట్రీషిన్ డాక్టర్ శ్రీనివాస...