Essay - kharamu palu

ఖరము పాలు
------------------------------

"గంగిగోవు పాలు గరిటెడైనను చాలు
కడవెడైననేమి ఖరము పాలు"

అంటాడు యోగి వేమన. పట్టెడు భక్తి కలుగు కూడు మంచిదనే ఉద్దేశంలో ఆయన ఆ పోలిక చెబుతారు.
భక్తికలుగు కూడు అంటే పోషక విలువలు కలిగిన ఆహారం అనుకోవచ్చేమో.
పిల్లలకు తల్లి పాలు లేకపోతే చాలా మంది ఆవు పాలను ఇవ్వమని చెబుతూంటారు.
ఆవుపాలు తల్లి పాలవలెనే శ్రేష్ఠమనీ చెబుతారు.
ఇంకొంత రిలీజియస్ బెంట్ ఉన్నవారు, ఆవు దైవంతో సమానమనీ, సకల దేవతలూ ఆవులోనే ఉన్నారనీ నమ్మకం కలిగి ఉంటారు.
అమ్మ పాలవంటి పాలను ఆవు తప్ప ఇంకే జంతువూ అందించలేదనీ, అందుకే ఆవును అమ్మ లాగా గౌరవించాలనీ చెబుతూ ఉంటారు.
కానీ, సైంటిఫిక్ రీసెర్చి ఈ భావనలకు, నమ్మకాలకూ పూర్తిగా విరుద్ధమైనటువంటి రిజల్ట్సును చూపుతోంది.

తల్లి పాల తరువాత, దాదాపు అంతే శ్రేష్ఠమైన పాలు ఆవు పాలు కానే కాదు. వేమన ఏ ఖరము పాలైతే కడవడైననేమి అన్నాడో....అవే ఖరము పాలు తల్లి పాల వలెనే శ్రేష్ఠమైనవని ఆధునిక రీసెర్చి చెబుతోంది.
శ్రేష్ఠత ఆధారంగా పాలను ఒక క్రమంలో అమరిస్తే....తల్లిపాలు, గాడిద పాలు, మేక పాలు, ఆ తరువాతే ఆవు పాలు.
నా మిత్రుడు పేడియాట్రీషిన్ డాక్టర్ శ్రీనివాస్ ని అడిగాను...మరి గొర్రె పాలు, గేదె పాల పరిస్థితి ఏమిటిరా అని?.
అవి విశ్వామిత్రుడి సృష్టి కదరా మామా...పిల్లలకు సబంధించినంత వరకూ ఆ పాలల్లో నిజానికి ఏ విశేషమూ లేదని చమత్కరించాడు. అంతే కాక సైంటిఫిక్ రీసెర్చిలో గొర్రె, గేదె పాలు పిల్లలకు మంచిది కాదని తేల్చారట. కాబట్టి పైన చెప్పిన నాలుగు రకాల పాలపైనే విశేషంగా రీసెర్చి జరుగుతుందన్నాడు.

ఐతే ఖరము పాలలో ఉండేటువంటి పోషక విలువలు తల్లిపాలతో సరి తూ గుతాయి. కాబట్టి తల్లి పాలు లేని వారు గాడిద పాలు మాత్రమే తమ పిల్లలకు అందించాలని పేడియాట్రిక్ డాక్టర్లు చెబుతున్నారు. గాడిద అంటే అదో చెడు జంతువుగా భావించే వారు, మొదట దాని పాలలోని విశేషతను గుర్తించాలని మనవి. వసుదేవుడంతటి వాడు....అనే సామెతను చూసైనా తల్లి పాలు లేని వారు తప్పక గాడిద పాలపై ఆధారపడి తమ పిల్లలకు తగిన పోషక విలువలను అందించగలరు. ఆవుపాలలో అధిక క్లోరైడ్, సోడియం, పొటాషియం వలన ఆస్మొలాలిటీ పెరిగి, ఆవు పాలు పిల్లలలో అధిక సొల్యూట్  లోడ్ ని కలిగిస్తాయి. ఆవు పాలలో ఉండే లక్టో గ్లోబ్యులిన్ మిల్క్ అలర్జీ రావడానికీ, పిల్లలలో కడుపునొప్పి రావడానికీ కారణం. తల్లి పాలలో ఉండే ఎస్సెన్షియల్ ఫాటీ యాసిడ్లు పిల్లల మెదడు పెరుగుదలకు దోహదపడితే ఆవు పాలలో ఈ ఫాటీ యాసిడ్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఆవుపాలలో అధికంగా సాచురేటెడ్ ఫాటీ యాసిడ్స్ ని అరిగించుకోలేక పిల్లలు ఇబ్దంది పడతారు. కానీ గాడిద పాలు తల్లి పాలలోని పోషక విలువలతో దాదాపు సరి తూగడం వలన, తల్లి పాలు లేని సమయంలో ఆవు పాలకంటే గాడిద పాలు మంచిదని పేడియాట్రీషియన్స్ రికమెండ్ చేస్తున్నారు.
కానీ, తల్లి పాలకు ప్రత్యామ్నాయం లేదని గమనించగలరు.

Comments

Popular posts from this blog

చూపుడు వేలు. కవిత

Kaala film review

ఆరాల వాళ్ళు. కవిత