Essay. తిట్ల పురాణం
తిట్ల పురాణం.
----------------------
ఆమధ్య ఒక మిత్రుడు నన్ను బాగా బూతులు తిడుతూ కొంతకాలం కొన్ని పోస్టులు కొన్ని కామెంట్లూ పెట్టుకున్నాడు. నేను చూసి కూడా పెద్దగా స్పందించలేదు. ఇంకో మిత్రుడు..."ఆయన అలా తిట్టేస్తుంటే నిమ్మళంగా ఉన్నావేంటి?" అని అడిగాడు. "ఆయనకు నన్ను తిట్టడం లేదా నా స్థానంలో ఇంకెవరినైనా తిట్టడం ఒక మానసిక అవసరం. నాకు ఆ అవసరం లేదుగా..!" అని చెప్పాను.
ఈ తిట్టే వ్యక్తికి ఎవరో ఒక శత్రువు కంపల్సరీ గా ఉండాలి. ఈ సారికి నేను. నేను కాకుంటే అతడు ఇంకో వ్యక్తిని వెతుక్కుని తిట్టడం మొదలు పెడతాడు. ఏముంటుంది ఈ తిట్టడంలో మజా అంటే...చాలానే ఉంటుందని చెప్పాలి. మనిషికి ఇంకో మనిషిని ప్రేమించడం, ప్రేమించబడడం ఎంత అవసరమో ద్వేషించడం, ద్వేషించబడటం కూడా అంతే అవసరం. మహాభారతంలో ధర్మరాజుకు అజాత శతృవని పేరు. కానీ మహాభారతం మొత్తంలో బోరింగ్ క్యారెక్టర్ ఎవరూ అంటే ధర్మరాజే అని చెప్పక తప్పదు. ఎవరినీ తిట్టకుండా పరమ సాధువు లాగా కనిపించే భర్తను ఏ భార్యా భరించలేదు గాక భరించలేదు అంటాడు ఒక సైకాలజిస్టు.
నిజానికి ఎంత ద్వేషించినా...ఆ ద్వేషించబడిన వ్యక్తికి ఐదు పైసల నష్టం కూడా జరగదు. ఐతే మరెందుకు ద్వేషిస్తున్నట్టు?. నిజానికి ఒక వ్యక్తిని ద్వేషించడం వలన ఏదైనా లాభం ఉందా అంటే ...అది కేవలం ఆ ద్వేషించే వ్యక్తికే. అదొక మానసికోల్లాసం కలిగిస్తుంది. ముఖ్యంగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక వ్యక్తి గురించో ఒక విషయం గురించో తిట్టుకుంటూ కూర్చుంటే...ఆ వ్యక్తుల మధ్య ఒక స్నేహ బంధం ఏర్పడుతూ ఉంటుంది. ఫేస్ బుక్ లో తరచూ కనిపించే విషయం ఇది. ఒక రాజకీయ నాయకుడిని ఎవరైనా తిడితే ఆ తరువాత తిట్టిన వారందరు మొదటి తిట్టిన వ్యక్తికి మానసికంగా కనెక్ట్ ఐపోతారు. ఇంకాస్త ఎక్కువగా తిట్టడానికి అవకాశం కల్పిస్తూ ఉంటారు. కొంతకాలం ఇలాగే సాగితే వారంతా మంచి మిత్రులైపోతుంటారు.
అంతే కాకుండా మన దైనందిన జీవితాలు చాలా ఇరుకుగా పేలవంగా తయారయ్యే సరికి ద్వేషం ఇచ్చే కిక్కు మరేదీ ఇవ్వదు. ఈ మెటీరియలిస్టిక్ బిజీ సూపర్ఫీషియల్ జీవితాలు మనుషులను కసిగా ఉండాలని డిమాండ్ చేస్తూ ఉంటాయి. పూర్తిగా మనసులో ఉండే కసినంతా కక్కి వాంతి చేసుకోవడానికి బూతును మించిన ఆయుధం లేదు. మనసారా తిట్టి కొంతలో కొంత మానసిక ప్రశాంతతను పొందవచ్చును. అందుకని ఒక సాఫ్ట్ టార్గెట్ ను ఎంచుకుని రోజుల తరబడి టీవీ సీరియల్ లాగా తిట్టే వాళ్ళూ ఉన్నారు. ఆ వ్యక్తి మానసికంగా ఎంతగా కృంగి పోయి ఉంటే అంతగా ద్వేషాన్ని సీరియల్ లాగా నడపగలడో నగర పౌరులు సీరియస్ గా ఆలోచించాలి. అంతే కాకుండా అతడిని లోపలున్నదంతా కక్కే వరకు మనం ఎంకరేజ్ చేయాలి. దీనినే ఫ్రాయిడ్ సైకో అనాలసిస్ కి ఉపయోగించుకుని ఎందరో దీర్ఘకాలిక మానసిక రోగులకు స్వస్థతను చేకూర్చాడనే విషయాన్ని మనం మరిచి పోకూడదు.
ఇంకొంతమంది కి తిట్టడం వలన తమకు తామెవరో తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఆ మధ్య ఒకాయన ఒక కులాన్ని తిడుతూ పొద్దున్నుంచి సాయంత్రం దాకా అవే పోస్టులు పెడుతూ కనిపించాడు. నిజానికి అతడు ఆ కులం వారిని తిడుతూ.."చూశారా..! నా కులం ఈ విధంగా లేదు" అని చెప్పదలిచాడు. ఆ విధంగా అతడు తన కులం గురించి ఇతరులకు చెప్పడం కోసం మరో కులాన్ని తిట్టడం లో తలమునకలై కనిపించాడు. దాని వలన అతడిలో తెలియకుండానే తన కులం పట్ల గౌరవమూ...అదే విధంగా ఇతరులతో కలిసి తిట్టడం వలన తన కులానికి ఒక సాంక్టిటీ ని రాబట్టగలిగాడు. అంతే గాకుండా ఆ పర్టికులర్ కులాన్ని తిట్టడం లో ఇతడు ఉద్దండ పిండంగా అవతరించ గలిగాడు. ఆ తిట్టే గ్రూపులో ఇపుడతడు గొప్ప సంస్కరణవాదిగా తన ఐండెంటిటీని నిలుపుకోగలిగాడు. సెలెక్టెడ్ గా మతాలను తిట్టే సూడో నాస్తికులు కూడా ఈ టెక్నిక్ ను బాగా ఉపయోగించుకుంటూ ఉంటారు. వీళ్ళ నిజజీవితంలో ఫెయిల్యూర్ అవుతూ ఉండటం వలన ఆ ఐడెంటిటీ లోపాలను ఈ విధంగా సవరించుకుంటూ ఉంటారు. కాబట్టి వారికి తిట్టడం ద్వేషించడం అనేది కేవలం వెర్బల్ డయేరియా మాత్రమే కాదు. వారికి ఒక అత్యవసరమైన మానసిక అవసరం.
కాబట్టి తిట్టే వారిని హాయిగా తిట్టనివ్వడం వలన వారి వారి మానసిక ఒత్తుడులకు మనం ఉపశమనం కలిగించిన వారిమౌతాం. తిట్టు తిట్టే వారిని అసహ్యించు కోకుండా వారి మానసిక స్థితి ని అర్థం చేసుకుని గౌరవించాల్సిన అవసరం మానవతావాదులకు ఎంతైనా ఉంది. So let them hate for the betterment of humanity.
విరించి విరివింటి
27/5/18

Comments
Post a Comment