Film essays. Melancholia
మెలాంఖోలియా. ---------------------- "మన భూగోళం పాపిష్టిది. ఇది వినాశనం ఔతున్నపుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు". అంటుంది జస్టిన్. భూమి మీద జీవితాన్ని జీవన మాధుర్యాన్ని ఎన్నో రకాలుగా నాశనం చేసుకుంటున్నాం మనం. ఎంతగా ద్వేషాల్ని, విద్వేషాల్ని నూరి పోసుకుంటూ, పోగుచేసుకుంటూ మనుషులమని చెప్పుకు తిరుగుతుంటాం మనం. నాగరికత అనీ, ఎంతో అభివృద్ధి చెందామనీ ఎన్నో బీరాలూ పలుకుతుంటాం. కానీ....ఈ జీవితం మొత్తం...ఈ నాగరికత, అభివృద్ధీ మొత్తం..ఒక్కసారిగా కుప్పకూలిపోతే...? అంతమైపోతే..? వస్తుందా అటువంటి రోజు?. భూమి మొత్తం సర్వనాశనమయ్యే రోజు వస్తుందా?. ప్రపంచంలో యుద్ధాలు ఒకవైపు, శాంతి చర్చలూ ఒకవైపు...మూడో ప్రపంచ యుద్ధం వస్తే తప్ప ప్రపంచం అంతమైపోదు అనుకునేవారికి మనం విశాలమైన అంతరిక్షంలో భూమి అనే గ్రహం మీద ఉన్నామని గుర్తుచేయకతప్పదు. మనలను నాశనం చేయడానికి అంతరిక్షంలో ఎన్నో అస్టరాయిడ్లు, తోకచుక్కలూ, గ్రహాలూ వేచి చూస్తున్నాయి. అనంతమైన అంతరిక్షంలో ఒక చోట శూన్యంలో వేలాడే ఒక గ్రహం మీద మనం అంతగా ఆశలు పెంచుకోవడానికి ఏమీ లేదు. పైగా మన సుందర భూగోళాన్ని పాపిష్టి ప్రపంచంలా మార్చుకున్నాక ఏ గ్రహశకలమో వచ్చి ఢీకొంటే మ...