Film essays Hallabol
Raise your voice
Halla bol
------------------
అతడు సినిమా హీరోగా ఎన్నో హీరోయిక్ రోల్స్ చేశాడు. కానీ అతడికి స్పష్టంగా తెలుసు అవేవీ అతడు కాదని. అతడి లోపలి మనిషి "సినిమా" అనే రంగుల ప్రపంచంలో మధ్యతరగతి విలువలనూ మెలమెల్లగా కోల్పోతున్నాడనీ అతడికి తెలుసు. ఎన్ని అవార్డులొచ్చినా ఎంతో స్టార్డమ్ వచ్చినా ఇంకా ఏదో వెలితి. ఏదో వంటరితనం. చీకటిలో కూర్చుని లోలోపలికి చొచ్చుకుపోయి తనను తాను చూచుకోవాలనే తపన. కానీ సినిమా ప్రపంచం అందుకు ఆస్కారమివ్వదు. తన మూలాలు వీధి నాటకంలో ఉన్నాయని తనకు తెలుసు. ఒక విప్లవకారుడిగా ప్రజల్లో తేలేని చైతన్యాన్ని వీధి నాటకాలద్వారా తీసుకురావచ్చు అనుకునే తన గురువు నేర్పిన ఆదర్శాలు ఒక సినిమా నటుడుగా మారిన తరువాత కోల్పోతున్నాననీ తనకు తెలుసు. ప్రజల వీక్ నెస్ లను చైతన్యం వైపు నడిపే నాటక కళకూ ప్రజల వీక్ నెస్లను క్యాష్ చేసుకునే సినిమా కళకూ సంబంధం లేదనీ తనకు తెలుసు. కానీ వచ్చిన పేరునీ డబ్బునీ వదులుకోలేక తనతో తాను వేరు పడక తప్పని పరిస్థితి.
"ఒక దళిత అమ్మాయి అమానుషంగా చంపబడింది. నీవు పేరుమోసిన హీరోవు కాబట్టి బయటకు వచ్చి వీధి నాటకం కట్టు. ప్రజలను చైతన్య పరచు" అంటాడు గురువు. కానీ ఇతగాడు ఎంతో మారిపోయాడుగా..! ఇపుడు అంతా డబ్బు మయం. అంతటి హీరో బయటికెందుకు రావాలి. ఈ సినీ మాయ లోకంలో ఎవరు ఎంత మౌనంగా ఉంటే అంత గొప్ఫవారు కదా. అనవసరమైన తలనొప్పులను మీదెందుకు వేసుకోవాలి?. ఎవరెటుపోతే ఏమి?. ఎవరేమైపోతే ఏమి?. కెమెరా ముందు రంగులేసుకుని విప్లవం గురించి, అన్యాయాల గురించి పవర్ ఫుల్ డైలాగులు నాలుగు కొడితే చాలు కదా. నాలుగు విజిల్స్ పడతాయి. నాలుగు డబ్బులూ వెనుకేసుకోవచ్చు. కళ లక్ష్యం ఏమిటి? తన శిష్యుడేనా ఇతడు అనుకుని గురువు వెళ్ళిపోతాడు. హీరో తన భార్య దగ్గరకు పోయి గొణుగుతాడు. "ఎందుకు తనను బజారుకి ఈడ్చాలని ప్రయత్నిస్తారు. నా లక్ష్యాలు వేరే కదా...నన్నెందుకు ఇలా బతకనీయరు. అప్పటికీ ఇప్పటికీ ఏమైనా నాలో తేడా వచ్చిందా.?" అని అడుగుతాడు. నీవు నీ మాటలలో "నేను నేను" అనే పదమే ఎక్కువగా ఉపయోగిస్తున్నావు అంటుందావిడ.
ఆ తరువాత ఒక సినిమా ఫంక్షన్లో ఒక యువతిని రేప్ చేసి చంపేస్తారు. చంపిన వారు బడా బాబులు కొడుకులు. అంతా నిశ్శబ్ధం. రంగుల ప్రపంచంలోని రంగులు అందరి కళ్ళూ మూసేస్తాయి. ఆ నటనలు అందరి నోళ్లూ మూసేస్తాయి. ఏమీ జరిగినట్టే ఉంటుంది అంతా. ఏమీ చూడనట్టే..ఎవరూ మాటాడనట్టే ఉంటుంది. హీరో కంటి ఎదుటే హత్య జరుగుతుంది. కానీ నిజ జీవితంలో మౌనంగా ఉంటూ సినిమాల్లో విప్లవ డైలాగులు దంచుతుంటాడు హీరో. నిజం చెప్పాలంటే భయం. పోలీసులదగ్గర అబద్ధం చెబుతాడు. పోలీసులకూ అతడు అబద్ధం చెప్పడమే కావాలి. అంతా నటన. అందరూ సమాజం కోసం న్యాయం కోసం కృషి చేస్తున్నట్టు నటించడమే. హత్య జరిగిన అమ్మాయి చెల్లెలు, హీరో దగ్గరకు న్యాయం కోసం వస్తుంది. "ఇవన్నీ మర్చిపోయి బాగా చదువుకో.. మీ అమ్మను బాగా చూచుకో.. అప్పుడే మీ అక్క ఆత్మ శాంతిస్తుంది" అని చెబుతాడు. ఆ అమ్మాయి "మొదట మీ ఆత్మ శాంతి గురించి ఆలోచించండి" అని చెప్పి వెళ్ళిపోతుంది. అవును అతడు అతడు కాదు. అందుకే అతడికి శాంతి లేదు.
ఇక మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. హత్య ఉదంతంలో తాను సాక్షినని చెబుతాడు. అనామకురాలైన ఒక్క ఆడపిల్లకు అన్యాయం జరిగితే కోట్లు సంపాదించే సినీ హీరో అన్నీ వదులుకుని పోరాటం చేస్తానంటాడు. ప్రజలు జేజేలు పలుకుతారు. కానీ రాజకీయ నాయకులు బడాబాబుల దాడులు..బెదిరింపులు అక్రమ సంబంధాలు అంటగట్టడాలు అన్నీ చవిచూస్తాడు. ఎక్కడా తల వొగ్గడు. తన గురువు నేర్పిన పాఠం అదే. కళ చైతన్యవంతం చేసేది. అంతేగానీ మనుషులను భయకంపితులను చేసేది కాదు. ఒకమ్మాయికి న్యాయం జరగడం కోసం తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ఒక హీరో చేసే పోరాటమే ఈ సినిమా హల్లా బోల్.
రాజ్కుమార్ సంతోషీ కొన్నిచోట్ల తడబడినట్టు కనిపిస్తాడు. మీడియా అతి, ప్రజల నిర్లిప్తత, దేశం రాజకీయాలూ, బాలీవుడ్ రంగుల కల, వంటి ఎన్నో అంశాలను ఒకేసారి స్పృశించాలని తపించడం వలనేమో కొన్ని చోట్ల కథమీద గ్రిప్ సడలిందేమో అనిపిస్తుంది. కానీ అజయ్ దేవగన్ తన నటనతో కట్టి పడేస్తాడు. గురువుగా మహా నటుడు పంకజ్ కపూర్. కథనం మామూలుగా సాగినా కథలో బలం. 2008 ప్రాంతంలో జరిగిన కొన్ని హత్యలకూ ఉద్యమాలకూ ఈ సినిమా కథా రూపాన్ని ఇస్తూనే నిజమైన హీరోలనూ సినిమా హీరోల నుండి వేరు చేసి చూపిస్తుంది. ఒక సినిమా హీరోలో ఉద్యమకారుడుంటే సమాజం ఎంతగా మారుతుందో అనిపించేలా ఉంటుంది. తప్పక చూడండి హల్లా బోల్ అంటే గొంతెత్తండి అని అర్థం. మన సినిమా హీరోలు గొంతెత్తగలరా సమస్యలపై? ఏమో చూడాలి.
విరించి విరివింటి
27/4/18

Comments
Post a Comment