Posts

Showing posts from June, 2018

Kaala film review

"కాలా" A film for coming Elections? ------------------------------------------- "కాలా" సినిమా చూసినపుడు రెండు విషయాలు కనిపిస్తాయి. ఒకటి దర్శకత్వ ప్రతిభ. చెప్పదలచుకున్న అంశాన్ని వివిధ దశలలో కనుల ముందు దర్శింప చేయటంలో పా.రంజిత్ విజయాన్ని సాధించాడు. తమిళ ఫార్ములా సినిమాలకు భిన్నమైన కథను కథనాన్ని అతడు తెరమీద నిలుప గలిగాడు. కెమెరాను ఉపయోగించిన విధానం గానీ, సినిమా పేసింగ్ ను అవసరమున్న చోట తగ్గించిన విధానం గానీ..బీజీఎం సహాయంతో అవసరమైన ఎమోషన్ ని రాబట్టడంలో గానీ ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ బ్యాంగ్ లను మలచిన విధానం గానీ, ఆర్టిస్ట్ ల ముఖాలను మాత్రమే హైలైట్ చేసిన విధానం గానీ చాలా కొత్తగా, విభిన్నంగా ఉన్నాయి. కథ చెబుతున్న కెమెరా, కథతో పాటుగా ఎన్నో ప్రాపర్టీస్ ను కథకు తోడ్పడే విధంగా మలుచుకుంటుంది. అసురుడు పుస్తకం కనబడటమే కావచ్చు లేదా బౌద్ధాలయం కావచ్చు, అంబేద్కర్ పెరియార్ ల పటాలే కావచ్చు,  అవి చెప్పదలచుకున్న అంశానికి తగినంత ఫిలాసాఫికల్ బ్యాగ్రౌండ్ ని ఏర్పరచటానికి ఉపయోగ పడ్డాయి. ఇటువంటి విధానం కమల్ హాసన్ తీసిన "హేరామ్" సినిమాలోనూ కనిపిస్తుంది. కానీ రంజిత్ ముఖ్యమైన...