Essay- Arjun Reddy- A destruction of the self
Arjun Reddy, A destruction of thè self
అర్జున్ రెడ్డి ఎవరు? అని అడిగితే బహుశా ఒక్కొక్కరు ఒక్కో సమాధానం ఇస్తారు. వాడిని ఎవరు ఎలా అర్థం చేసుకుంటే అందుకు అనుగుణంగా సమాధానం రావచ్చు. ఐతే అన్నింటికంటే ఇర్రిటేటింగ్ సమాధానం, ఇట్స్ జస్ట్ ఏ ఫిల్మ్ అనడం. ఐతే ఇట్స్ జస్ట్ ఏ ఫిల్మ్ అనుకోవాల్సిన సినిమాలు మన తెలుగులోనే ఎక్కువగా ఉన్నాయి. లాజికల్ థింకింగ్ కీ, రియాలిటీకీ సంబంధం లేని తెలుగు సినిమా కథల హోరు, అర్థం లేని హీరోయిజాలు బహుశా మనలో ఇటువంటి జస్ట్ ఏ ఫిలిం అనే భావాల్ని స్థిరపరిచి ఉండవచ్చు. ఎవరైనా ఒక సినిమాని విమర్శిస్తే, ఇంత అవసరమా..ఇట్స్ జస్ట్ ఏ ఫిల్మ్ అని అనడం చూస్తూ ఉంటాం. స్లోవీనియన్ ఫిలాసఫర్ స్లావోజ్ జిజెక్ ఫిల్మ్స్ కెన్ థింక్ అంటూ సమాజంలోని ఆలోచనల ప్రతిరూపంగా సినిమాలను చూడాలని సూత్రీకరిస్తూ అద్భుత విమర్శతో అబ్బురపరుస్తూన్నపుడు, సినిమాను సినిమాలాగా చూడాలని తలా తోక లేని వాదనతో మన తెలుగు మూర్ఖ శిఖామణులు ఇట్స్ జస్ట్ ఫిలిం అంటూ ఉంటారు. ఒక గ్రూప్ ఆఫ్ థింకర్స్ ఒక ఐడియాను రిప్రెజెంట్ చేయడానికి సినిమా అనే మాధ్యమాన్ని వాడుకుంటున్నపుడు, ఇట్స్ జస్ట్ ఏ ఫిలిం అనడంలో వారి అపరిపక్వత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతే కాకుండా కళ విమర్శ రెండూ కూడా చేయీ చేయీ పట్టుకుని నడుస్తాయనే ఇంగితం తమకు తాము కవులమనుకునే, అపర శ్రీశ్రీలమనుకునే ఉద్దండ పిండాలకూ లేకపోవడం తెలుగు వాడి దౌర్భాగ్యం. ఇవన్నీ పక్కకు పెడితే ఇట్స్ జస్ట్ ఎ ఫిలిం అనుకోవడానికీ, మన తెలుగు వాడి విమర్శనా ధోరణి ఆ విధంగా ఏడవడానికి కారణం తప్పకుండా మన తెలుగు సినిమా ఫార్ములా కథల దౌర్భాగ్యపు స్థాయిదే కారణం. కానీ అలా జస్ట్ ఏ ఫిలిం అనుకోవడానికి ఏ మాత్రం ఆస్కారం లేని సినిమా అర్జున్ రెడ్డి.
విష్ చేసినపుడు పేరు అర్జున్ అని చెబితే, కుల తోకల కోసం అర్జున్ తరువాత ఏమొస్తుంది, రెడ్డినా,శెట్టినా, శర్మనా, శాస్త్రినా అని ఆలోచించే ఒక పదో తరగతి పిల్లగాడు ఇరవై యేడేండ్లు నిండిన హీరోని రెట్టించి అడుగుతున్న సమాజం మనది. అటువంటి సమాజంలో ఏర్పడిన లైఫ్ హోప్ లెస్ నెస్ కి ప్రతిరూపం ఈ అర్జున్ రెడ్డి. సినిమాలోని పదో తరగతి పిల్లగాడు చేసిన తప్పునే దర్శకుడు సినిమా పేరు పెట్టడం, తన పేరులో ఉండే రెడ్డిని వాడుకోవడం ద్వారా ఏమి మెసేజ్ ఇవ్వదలచుకున్నాడో అనేది అర్థం కాదు. ఇంత సినిమా తీసి అదే పదో తరగతి పిల్లగాడి మనస్తత్వంతో దర్శకుడు ఆగిపోవడం విడ్డూరమే కాక దిగ్భ్రాంతికర విషయం కూడా. ఆ విషయం ఒక్కటి వదిలేస్తే సినిమా దేనిని చర్చిస్తుందనేది చాలా ఆసక్తికర విషయం. చాలా స్పష్టంగా దర్శకుడు ఒక అద్భుతమైన ప్రేమ కథ తీయాలనుకున్నాడు. సముద్రపు వడ్డున భరత నాట్యం చేస్తున్న ప్రియురాలి దగ్గరకు వెల్లి ముఖంలో ముఖం పెట్టి ఒకరికొకరు తాదాత్మ్యంగా చూసుకుంటూ, సూర్యాస్తమయాన్ని తనివితీరా ఆస్వాదిస్తున్నట్టు చూపించిన ఒక్క సీన్ చాలు, సినిమాలో దర్శకుడు ఏమి చూపించదలచుకున్నాడో చెప్పడానికి. దీనిని సుందరమైన ప్రేమ కథగా తప్ప ఇంకెలా చూసినా అర్థం కాదు. కానీ దానికి దర్శకుడు ఎంచుకున్న కథ, చెప్పిన విధానం, వాటి వెనుకనున్న ఫిలాసాఫికల్ నేపథ్యమూ బహుశా తెలుగులో ఇంత వరకూ రాలేదేమో.
మనిషిలో జీవితేచ్ఛ, మరణేచ్ఛ అనే రెండు వ్యతిరేక శక్తులు నిరంతరం సంఘర్షించుకుంటూంటాయి అంటాడు ఫ్రాయిడ్. జీవితేచ్ఛ మనిషిని తనకు వచ్చిన జీవితాన్ని ఆనందంగా స్వేచ్ఛగా జీవించడానికీ, రి ప్రొడక్షన్ ద్వారా తన వారసులను తయారు చేసుకుని తన జీవనాన్ని తన పిల్లల ద్వారా కొనసాగించడానికీ ఆలంబనగా ఉంటే, మరణేచ్ఛ తనను తాను విచ్ఛిన్నం చేసుకోవడానికీ, అంతిమంగా మరణించడానికి ప్రోద్బలాన్ని ఇస్తుంది. మనిషికి ఉండే మరణేచ్ఛలోని ఒక భాగమే సెల్ఫ్ డిస్ట్రక్షన్. ఈ సినిమాలో ప్రేమతో పాటు కనిపించే ప్రధానమైన అంశం ఈ సెల్ఫ్ డిస్ట్రక్షన్ . ఇది ఈ సినిమాతో మాత్రమే మొదలవలేదు. ఇంతకుముందు ఇదే అంశంతో తెరకెక్కిన హాలీవుడ్ సినిమాలూ ఉన్నాయి. ఇంతకు ముందటి శరత్ దేవదాసూ ఉన్నాడు. ఐతే శరత్ దేవదాసు తెలుగులో బాధే సౌఖ్యమనుకునే వాడిలాగా చూపబడ్డాడు. కానీ అతడికీ సెల్ఫ్ డిస్ట్రక్షన్ ని ఆహ్వానించే అర్జున్ రెడ్డికీ సంబంధం లేదు. షేక్స్పియర్ ఒథెల్లో, హామ్లెట్ కథలలో కూడా ప్రొటాగొనిస్ట్ లు ఈ సెల్ఫ్ డిస్ట్రక్షన్ మార్గాన్ని ఎంచుకుంటారు. అర్జున్ రెడ్డి సెల్ఫ్ డిస్ట్రక్షన్ లోకి ఎందుకు పోతాడు అనే అంశం మొదటి భాగంలో ఒక అందమైన ప్రేమ కథ ద్వారా దర్శకుడు చూపిస్తాడు. రెండవ భాగంలో అర్జున్ రెడ్డి సెల్ఫ్ డిస్ట్రక్టివ్ డూమ్డ్ ప్రోటాగొనిస్ట్ గా చూపబడతాడు.
అసలు అర్జున్ రెడ్డి సెల్ఫ్ డిస్ట్రక్షన్ లోకి ఎందుకు పోతాడు?. అతడి చుట్టూ ఐదున్నరేండ్ల మెడికల్ కాలేజీ జీవితం అతడికి ఓ అందమైన ప్రేమ మయ జీవితాన్నీ, స్వేచ్ఛాయుత జీవితాన్నీ అందిస్తుంది. ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు అర్పితం చేసుకోవడానికి, సఖ్యతను పెంచుకోవడానికి, ఇంకో రకంగా చెప్పాలంటే పిచ్చి ప్రేమలో మునిగిపోవడానికి ఐదున్నరేండ్ల కాలమేమీ తక్కువ కాలం కాదు. హీరోయిన్ మెడికల్ కాలేజీ చదువైపోగానే జీవితంలో మరో ముఖ్య ఘట్టం పెళ్ళి. దానికోసమై పెద్ద వాళ్ళని ఒప్పించాలని వెళ్ళినపుడు అకస్మాత్తుగా తారసపడ్డ స్వేచ్ఛారహిత, సాంప్రదాయ పోకడల, కుల పీడిత సమాజం. ఒక్కసారిగా ఛిద్రమైన కలలు. ఈ సమాజపు నీచ స్థితినీ, అమ్మాయి తల్లిదండ్రులుగా ఎదురుపడే సమాజపు రక్కసులనూ చూసినపుడు అర్జున్ రెడ్డి ఒక హోప్ లెస్ సిట్యుయేషన్ లోకి అకస్మాత్తుగా పడిపోతాడు. హీరోయిన్ తండ్రి తనను గల్లా పట్టుకుని ఈడ్చి గేటు బయటకు తోసేసినపుడే అతడికి ప్రేమ విషయంలో తన ఓటమి ఖాయమని అర్థం ఐపోతుంది. అతడికి స్పష్టంగా ఇక తమ పెళ్ళి జరగదని తెలుసు కాబట్టే, తక్కువలో తక్కువ ఆరు గంటలు సమయం ఇచ్చి, హీరోయిన్ తలిదండ్రులను ఒప్పించమంటాడు. ఇరవై యేడేండ్ల మగ పిల్లవాడికి 'పర్సనల్ స్పేస్' అంటే అర్థం చేసుకోలేని తన తండ్రి, అదే స్పేస్ ని పెద్ద నేరంలా భావించి బయటకు గెంటిన హీరోయిన్ తండ్రి, ఎవరూ ఆలోచనలో ఎదగని పెద్దలుగా మనకు కనిపిస్తారు. ఇటువంటి సిట్యుయేషన్ లో అర్జున్ రెడ్డి ముందు ఉండే ఏకైక మార్గం, సెల్ఫ్ డిస్ట్రక్షన్, ఏ స్లో కైండ్ ఆఫ్ సూసైడ్. సైకాలజీలో ఇదొక ప్రధానాంశం. కలలుగన్న భవ్య జీవితానికి అకస్మాత్తుగా కోలుకోలేని దెబ్బ తగిలినపుడు మనిషి ఈ స్థితిలోకి పోతాడు. ఒక రకమైన మొండితనం, రానీ ఎంత నష్టం ఒస్తుందో రానీ, పోనీ, పోతే పోనీ, సుతుల్, హితుల్, మతుల్ పోనీ, కష్టాల్ నష్టాల్ కోపాల్ తాపాల్ శాపాల్ రానీ అనుకునే ఒక మానసిక స్థితి. కొన్ని నష్టాల్ని తమకు తెలిసీ, తమ వినాశనం పట్ల తామే కసితో చేసుకుంటే, ఇంకొన్ని నష్టాలను తమకు తెలియకుండా, అంటే అన్ కాన్షియస్ గా చేసుకుంటారు. సెల్ఫ్ డిస్ట్రక్షన్ స్థితిలో డ్రగ్స్ బారిన పడటం అనేది చాలా కామన్ గా కనిపించే అంశం. డిస్ట్రక్టివ్ సెక్షువల్ రిలేషన్స్ నెరపడం, ఎవరి మాటా వినకపోవడం, తప్పు చేశాననీ నన్ను ఉరితీయండి అని చెప్పుకోవడంలో భేషజాలు లేకపోవడం ఇత్యాదివి. అవన్నీ అర్జున్ రెడ్డిలో మనకు కనిపిస్తాయి.
ఐతే రెండవ భాగంలో సెల్ఫ్ డిస్ట్రక్షన్ అంశమే ప్రధానం కావడంతో అతడు అందులోంచి ఎలా బయటకు వచ్చాడనే విషయాన్ని కన్విన్సింగ్ గా ప్రజెంట్ చేయలేకపోయాడు దర్శకుడు. చేయలేక కాదేమో, కానీ నిడివి, సాగతీత వంటి మాటలకు అనవసరంగా తలొగ్గి అనుకుంటాను. నాయనమ్మ చనిపోవడంతో అకస్మాత్తుగా ఆ స్థితి నుండి బయటపడటం చూపిస్తాడు. మెడికల్ ఇలా జరగడం అసాధ్యం అనడానికి కూడా ఏమీలేదు. జరొగొచ్చుకూడా. కానీ అది అబ్రప్ట్ గా ప్రెజెంట్ చేయడం వలన ప్రేక్షకుడు కన్విన్స్ అవడం కష్టమేమో. సెల్ఫ్ డిస్ట్రక్ట్ అవుతూ అర్జున్ రెడ్డి చచ్చిపోయి ఉంటే బహుశా ఒక హాలీవుడ్ సినిమా చూశాననే తృప్తి మిగిలేది. కానీ సగటు ప్రేక్షకుడి కోసం తెలుగు దర్శకుడు పాత చింతకాయ పచ్చడితోటే భోజనం ముగించడం చూశాక హాపీ ఎండింగ్ బిజినెస్ ట్రాప్ లోకి ఇటువంటి దర్శకుడూ పడిపోవడం కొంత బాధనిపించింది. అయితే కొందరు చెప్పినట్టు ఇదో బోల్డ్ మూవీ, రా ఎమోషన్సూ గట్రా నిజానికి ఏమీ లేవు. అంతకుమించి, ఏ సెన్సిబుల్ లవ్ స్టోరీ ఆఫ్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ డూమ్డ్ ప్రొటాగొనిస్ట్ కాల్డ్ డాక్టర్ అర్జున్ రెడ్డి.
9/9/17
విరించి విరివింటి

Comments
Post a Comment