సింధూరం. పుస్తకం మీద రైటప్
కార్ల్ మార్క్స్ రాసిన ఉద్గ్రంధం "ది కాపిటల్" అంత సులువుగా అర్థం కాదు. కొన్ని శతాబ్దాలు నిలబడిపోయే పుస్తకమిది. ఎందరో మేధావులు దానిని అర్థం చేసుకుని తమకు తోచిన రీతిలో వివరణ ఇవ్వగలిగారు. కానీ సీనియర్ పాత్రికేయులు వున్నం వెంకటేశ్వరులు Vunnam Venkateswarlu గారు వారి సతీమణి ఉష గారితో కలసి కాపిటల్ లోని మూల సిద్ధాంతాలను సరళమైన భాషలో "సింధూరం" పేరుతో కవిత్వం చేశారు. కాపిటల్ ను కవిత్వం చేయాలన్న ఆలోచనే కొత్తది. గొప్పది. అది కూడా అందరికీ అర్థమయ్యే సరళమైన భాషలో....
ఆ కవిత్వం ఎంతటి అద్భుతమైన వాక్యాలతో మొదలౌతుందో చూడండి. ఈ వాక్యాలు ఎంతటి సత్యాన్ని బట్టబయలు చేస్తున్నాయో ఒకసారి గమనించండి. శిలాక్షరాలుగా చెక్కు కోవాల్సిన వాక్యాలివి.
" ఎక్కడైనా ఎప్పుడైనా ఆకలి
చెలరేగి కేక పెట్టిందంటే
అక్కడ సిరిసంపదలన్నీ
బందీ అని అనుమానించు."
"ఎప్పుడైనా దౌర్జన్యం పెరిగి
రాజ్యమేలిందీ అంటే
అప్పుడు..సంపద అహంభావం
ప్రదర్శితమైందని గుర్తించు".
"ఎక్కడ ఎప్పుడైనా పేదరికం
సంకెలలతో ఉందీ అంటే
అక్కడ శ్రమ లొంగతీతకు
వెలిఆయుధమైందని తెలుసుకో".
"పెట్టుబడిలో పరిమళాలు వెతక్కు.
ఎక్కడైనా అవి గుబాళించాయంటే
అవి మరో మోసానికై కట్టుకున్న
అంట్లు అని భావించు".
కాపిటల్ ని అర్థం చేసుకోవటానికి ఈ పుస్తకం ఎంతగానో సహకరిస్తుంది.
ఆ కవిత్వం ఎంతటి అద్భుతమైన వాక్యాలతో మొదలౌతుందో చూడండి. ఈ వాక్యాలు ఎంతటి సత్యాన్ని బట్టబయలు చేస్తున్నాయో ఒకసారి గమనించండి. శిలాక్షరాలుగా చెక్కు కోవాల్సిన వాక్యాలివి.
" ఎక్కడైనా ఎప్పుడైనా ఆకలి
చెలరేగి కేక పెట్టిందంటే
అక్కడ సిరిసంపదలన్నీ
బందీ అని అనుమానించు."
"ఎప్పుడైనా దౌర్జన్యం పెరిగి
రాజ్యమేలిందీ అంటే
అప్పుడు..సంపద అహంభావం
ప్రదర్శితమైందని గుర్తించు".
"ఎక్కడ ఎప్పుడైనా పేదరికం
సంకెలలతో ఉందీ అంటే
అక్కడ శ్రమ లొంగతీతకు
వెలిఆయుధమైందని తెలుసుకో".
"పెట్టుబడిలో పరిమళాలు వెతక్కు.
ఎక్కడైనా అవి గుబాళించాయంటే
అవి మరో మోసానికై కట్టుకున్న
అంట్లు అని భావించు".
కాపిటల్ ని అర్థం చేసుకోవటానికి ఈ పుస్తకం ఎంతగానో సహకరిస్తుంది.
Comments
Post a Comment