GB on sapiens

1).హరారీ చెప్పిన విషయాల్లో 90% ఆల్రెడీ చరిత్రకారులూ ,ఆంథ్రోపాలజిస్టులూ చెప్పినవే.ఏ టెక్స్ట్ బుక్ లో అయినా అవి ఉంటాయి.
2). ఆల్రెడీ కచ్చితంగా నిరూపణ అయిన విషయాల్లో కూడా ఆయన చేసిన కొన్ని పెద్ద తప్పుల గురించి చాలా మంది చర్చ చేసి ఉన్నారు. 
3). ఇక ఆయన స్థూలంగా చేసిన వ్యాఖ్యానాలు philosophical anthropology అనే కేటగరీ కిందకి వస్తాయి. ఆ రకమైన వ్యాఖ్యానాన్ని ప్రపంచానికి మొదలు పరిచయం చేసినవాడు హెగెల్. మార్క్స్ ఆయనలో దాగిఉన్న బూర్జువా దృక్పథాన్ని తీవ్రంగా విమర్శించి లోతైన వ్యాఖ్యలు చేసి ఉన్నారు. Philosophical manuscripts , thesis on Feaurbach మొదలైనవి జాగ్రత్తగ చదివితే... హరారీకీ మార్క్స్ కూ మధ్య ఉన్న తేడాను గ్రహించ వచ్చును.
4). ఇక మనుషుల సబ్జెక్టివిటీ చరిత్ర నిర్మాణంలో ఎంతటి ముఖ్య పాత్ర పోషిస్తుందో మన దృష్టికి తెచ్చినవాడు మాక్స్ వెబర్.ఆయన ఒక రిగరస్ సైంటిస్ట్ ( మార్క్స్ లాగానే). 
5). హరారీ చరిత్రలో ..ఉత్పత్తి శక్తులే తప్ప ఉత్పత్తి సంబంధాలు కానీ ఇతర సామాజిక సంబంధాలు కానీ ఏ పాత్రా పెద్దగా పోషించవు.
6). ఆయన ఒకే కన్సర్న్ లిబరలిజం అనబడే కథనం తన  ఫోర్స్ ను కోల్పోయినందువల్ల మనం టెక్నాలజీ ,చేతికీ , కృత్రిమ మేధ చేతికీ చిక్కి అంతరించిపోతామని. 
ఈయన పుస్తకాలు చదివితే...ఈ టెక్నాలజీలు ఏ వ్యవస్థ యొక్క ఛాయిస్ లుగా  ఉత్పన్నమవుతాయో.. ఎవరి నియంత్రణలో ఉండి ఎవరి లాభాల దాహాన్ని తీరుస్తుంటాయో మనకు అర్థం కాదు. మొత్తం మానవాళే ( అమూర్తంగా) ఈ నాటి అధ్వాన్న పరిస్థితి కి బాధ్యత వహించాలని చెప్పి చేతులు దులుపుకుంటాడాయన.
7). సామాజిక శాస్త్రాలతో,సూక్ష్మ మైన చర్చలతో పరిచయం లేని సాధారణ పాఠకుడిని మిరుమిట్లు గొలిపే కథతో ఆయన ఆకట్టుకుంటాడనేది వాస్తవం.

హరారీ సామ్యవాది అనుకోవడం మోదీ ప్రజాస్వామ్యవాది అనుకోవడం రెండూ ఒకటే. హరారీ... కుళ్ళిపోయిన వెస్ట్రన్ ఆధిపత్యంపై కుహనా తాత్విక అత్తర్లు చల్లే ఐడియోలాగ్.


Comments

Popular posts from this blog

చూపుడు వేలు. కవిత

ఆరాల వాళ్ళు. కవిత

Kaala film review