Poem. Neerenda

విరించి  ll నీరెండ ll
---------------

ప్రపంచం మారిపోతుందా
అడిగినట్టు చూశాడతడు
కొలనులో గుడ్డలతోసహా నిండా మునిగి
గట్టు మీద బట్టలారబెట్టుకుంటూ...

సాయంత్రపు నీరెండలో
నీరెంతో ఎండెంతో అపుడే తెలిసినట్టయిందతనికి
ఆ రాత్రికల్లా కురిసే మేఘమైపోవాలని
అప్పటికప్పుడే గడ్డగట్టుకుని పోయాడతడు
వెన్నులో చలిలా మొదలైన భయపు అనుభవం నాది

జీవితమంటే బండపై నిలబడి
ఒంటిమీది తడి గుడ్దలను పిండుకోవడం
తడి పాదాల ముద్రలు వేసి వెళ్లిపోవడం అంతేగా..! అన్నాను నేను
ఎండ అన్నిటినీ ఎండగొడుతుందేమో
ఆరిపోతున్న పాదపు ముద్రలు చూస్తూ ఉండిపోయాడతడు

ప్రళయం అంటే అంతా నీరేనా ..! అడిగాడతడు
ప్రతీ ఎండాకాలపు కొలను అడుగున
ఒంటరిగా మిగిలిన శివలింగాన్ని గుర్తు చేసుకున్నాన్నేను.
నీరెండలో మా నీడలు ఎంత దూరంగా సాగి ఆవిరయ్యాయో...
ప్రపంచం మారినా సాయంత్రమెప్పటికీ మారదనుకున్నాం.

3/10/17

Comments

Popular posts from this blog

చూపుడు వేలు. కవిత

ఆరాల వాళ్ళు. కవిత

Kaala film review