Poem....ekam kandi
విరించి ll ఏకం కండి ll
------------------------------
ప్రపంచ సైనికుడా..!!
యుద్ధం మొదలయింది.
నీవు మాకోసం ప్రాణం కోల్పోక తప్పదు
నీవు బతుకుతావనీ, యుద్ధంలో గెలుస్తావనీ
మేం నీతో అబద్దాలాడతాం.
ఈ దేశం గెలుస్తుందనీ, ఆదేశం ఓడిపోతుందనీ బొంకుతాం.
నీవిక ఆలోచించాలి సోదరా..! ఇది క్రికెట్ మ్యాచ్ కాదు
ఎవరికీ ఏ హానీ జరగని మైదానంలో
దేశభక్తిని గుండెలనిండా ఉబ్బించే లేకితనమూ కాదు
పరమ వీర చక్రలూ, అమర వీరుల స్థూపాలూ
క్యాండిల్ ఏడుపులూ
సర్వమత సమ్మేళన నాటకాలూ
ఏదీ సోదరా....!!? వీటిల్లో నీ ప్రాణం ఉనికి?
గోడ మీద చిత్రపటంలా మిగిలిన నీకు
అర్థం కావాల్సింది ఒక్కటే..
యుద్ధమనే జీవితకాలపు మోసం
సైనికుడా...! నీదొక వింత మనుష్య జాతి
చావడానికి సిద్ధపడే అమాయక జాతి
ప్రపంచం నలుమూలలా విస్తరించిన ఆకలి జాతి
ఏ దేశంలో ఉంటే ఆ దేశ సరిహద్దుల మీదకి పాకే జాతి
మనుషుల మధ్యన గొడవలు సాధారణమే సోదరా..!
నీవున్నందుకే కదా యుద్ధాలున్నాయి
నీవున్నందుకే దేశాలున్నాయి
నీవున్నందుకే సరిహద్దులున్నాయి.
యుద్ధరంగంలో నిను కాల్చిన వాడూ నీలాంటి వాడే..
ఈ క్షణం కాకుంటే మరో క్షణంలో నేలకొరిగేవాడే
యుద్ధంలో చచ్చేవారంతా మీ సైనికులే
బతికేవారంతా మాలాంటి దొంగనాకొడుకులే
దేశభక్తనీ, దేశమనీ మిమ్మల్ని రెచ్చగొట్టే లుచ్ఛానాకొడుకులే..
ప్రపంచ సైనికులారా ఏకం కండి..!
యుద్ధంలో శత్రువనబడే సైనికుడి గల్లా పట్టుకుని ప్రశ్నించండి
ఒకరి కళ్ళ లోకి మరొకరు సూటిగా చూసుకోండి
ప్రపంచం మీతో ఆడుతున్న దొంగనాటకాల్ని పసిగట్టండి
సైనికుడి నుండి దొంగనాకొడుకులుగా మీరూ మారండి
స్వచ్ఛంధంగా యుద్ధం నుంచి విరమించండి
రండి...! ఇకపై
ఈ దగుల్బాజీ దేశాల రాజకీయాలు
ఎలా మారిపోతాయో చూద్దాం రండి
సరిహద్దులు కంచెలు ఎలా కూలిపోతాయో చూద్దాం రండి.
11/8/17

Comments
Post a Comment