Essay...slavery of our daily life
హాస్పిటల్ కి బుధవారం, శనివారం మెడికల్ రిప్రెజెంటేటివ్స్ వస్తూ ఉంటారు.
సాధారణంగా ఒక డ్రగ్ కంపనీ నుండి ఒకరు వస్తారు. ఒక్కోసారి వారికి తోడుగా వారి బాస్, ఏరియా మేనేజర్ కూడా వస్తూ ఉంటాడు.
డాక్టర్ ముందుకి రాగానే వారు వంగి వంగి గుడ్ మార్నింగ్, గుడాఫ్టర్ నూన్ చెబుతూ ఉంటారు.
వంగడం అంటే ఫ్యూడల్ కాలంలో దొరలముందు పాలేర్లు వంగి పోయినంతగా, బ్రిటీషు తెల్ల దొరల ముందు మనం నల్లవారిమి వంగి వంగి దండాలు పెట్టినంతగా, భుజాలు కిందికి చేసి భయం భయంగా జాగ్రత్తగా వంగి వంగి లోపలికి వస్తూ ఉంటారు.
గుడ్ మార్నంగ్ అనో, గుడ్ ఆఫ్టర్నూన్ అనో విష్ చేయడానికి అంతగా వంగాల్సిన అవసరం ఏముందయ్యా అని అడుగుతుంటాను. అదేంటి సార్ మీరు డాక్టరు కదా....గౌరవం అంటారు. వంగితేనే గౌరవమా అనేది ప్రశ్న. అతడు తన కంపనీ నుండి రిప్రెజెంటేటివ్ గా వచ్చాడు. తన కంపనీ కి చెందిన మందులు రాయమని అడగడానికి వచ్చాడు. అవి పేషంటుకి ఉపయోగపడతాయని కన్విన్స్ అవుతే రాస్తాం. దానికి వంగి వంగి రావాల్సిన అవసరం ఏందో నాకు అర్థం కాదు.
లోపలికి రాగానే, కూర్చోమని చెబుతా. కూర్చోవడం అలవాటే లేదన్నట్టూ..అబ్బే పర్లేదు సర్ అంటూంటారు. అంటే నిలబడి ఉంటేనే గౌరవించినట్టా..?
కూర్చుంటే గానీ మీరు చెప్పేది వినను అని చెబుతుంటా. నా బలవంతం మీద చివరికి ఏరియా మేనేజర్ ఎదురుగా కుర్చీ మీద కూర్చుంటాడు. ఆయన కింద పని చేసే సేల్స్ రిప్రెజెంటివ్ ఎక్కడ కూర్చోవాలో తెగ ఇబ్బంది పడుతూంటాడు. చివరికి వచ్చి పేషంటు కోసమని వాడే రివాల్వింగ్ స్టూలు మీద కూర్చుంటాడు. కుర్చీ స్థానం స్టూలు స్థానం కంటే ఎక్కువన్న మాట. తన బాస్ కుర్చీ మీద కూర్చున్నాడు కాబట్టి, అతడు స్టూలు మీద కూర్చోవటం ద్వారా, బాస్ ఆధిపత్యాన్ని గౌరవించేస్తుంటాడన్నమాట. భలే లాజికల్ మైండ్స్ మరి. లేచి ఆ కుర్చీ మీద కూర్చో అని ఏరియా మేనేజర్ పక్కన కుర్చీని చూపిస్తుంటా. తన బాస్ పక్కన కూర్చోవటమా?. అదీ అతడికై కేటాయించబడిన కుర్చీ పక్కనా..? అతడితో సమానంగానా..నో వే...అన్నట్టు అతడి ప్రవర్తన ఉంటుంది. "పర్లేదు సర్...ఐయాం కంఫర్టబుల్ హియర్" అనేస్తుంటారు. నేను మొండి ఘటం. అక్కడ కూర్చోవాల్సిందే అంటూంటాను. ఇక చివరగా ఆ బాస్ వంక చూస్తాడు. ఆ బాస్ 'ఇట్స్ ఓకే' అని సైగ చేస్తాడు, ఇంక అపుడు వచ్చి ఆ పక్కనుండే కుర్చీలో ఈ సేల్స్ రిప్రెజెంటేటివ్ వచ్చి కూర్చుంటాడు.
ఇక వీల్లందరూ నీట్ గా షేవ్ చేసుకుని, గడ్డం మీద ఒక్క వెంట్రుక ఉన్నా డాక్టర్లు సహించమనుకుంటారో ఏమో, అవసరం ఐతే మీసాలు కూడా తీసేసి, నీట్ ఇన్షర్ట్ వేసి, కడిగిన ముత్యంలా వస్తూంటారు. ఎండకు చెమటలు పట్టి ఉండింటే, ఆ సదరు డాక్టరు గారిని కలవడానికి ముందే వాష్ రూం కి వెల్లి ఫ్రెష్ గా ముఖం కడుక్కుని వస్తూ ఉంటారు. ఇలా రాకపోతే ఆ ప్రొడక్ట్ ని డాక్టర్లు రాయరని వారి నమ్మకం. ఎంతకైనా పనికిరాని ప్రొడక్ట్ లను అమ్మించడానికి అందమైన ఆర్టిస్ట్ అమ్మాయిలను ఉసిగొలిపే సంస్కృతి మనది కాబట్టి, జీవితానికి పనికొచ్చే మందులను రాయడానికి కూడా కనీసం ఈ మాత్రం కార్పోరేట్ ఎటిక్ అన్నమాట. ఇక డాక్టరు గారిని ప్రసన్నం చేసుకోవడం కోసం, లంచ్ కూడా చేయకుండా ఓ.పీ. బయట పడిగాపులు కాయడం , ఆకలి కడుపులతో డాక్టర్ల ముందు నవ్వుతూ మాట్లాడటం అలవాటు పడి ఉంటారు. ఈ రెండు వారాలలో మధ్యాహ్నం నా రూంలోంచి ఒకసారి బయటకు వచ్చి, డాక్టరుగారి కంటి చూపుకోసం బయట నిరీక్షిస్తున్న అమాయక మెడికల్ రిప్రెజెంటేటివ్ లను ముందు తినిరండని చెప్పి పంపుతుంటాను. అతడు రిప్రెజెంట్ చేసేదేమో ఆకలికి సంబంధించిన సిరప్..లేదా టైంకి అన్నం తినకపోతే వచ్చే గ్యాస్ ప్రాబ్లంకి సంబంధించిన యాంటాసిడ్ మందులు. ఇంకొంత మంది మెడికల్ రిప్రెజెంటేటివ్స్, హలో అని షేక్ హ్యాండు ఇచ్చినా మీవంటి వారు మావంటి అల్పులకు షేక్ హ్యాండు ఇవ్వడమా అన్నట్టు తటపటాయిస్తుంటారు. బానిసత్వం మనలో మన రోజూ వారి చర్యలలో ఎంతగా పాతుకుపోయింది.
ఇటువంటివి నా చుట్టూ ఉన్న వారిలో చూసినపుడు, వారికి చెబుతూంటాను. మనకు 1947 లో స్వతంత్ర్యం వచ్చిందని. ఈ బానిస బతుకులు, నటనలు ఆపమని. పనిలో అందరూ సమానమే. డాక్టరు ముందర వంగుతున్నావంటే స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరలైనా, ఇంకా బానిస బుద్ది మీలో పోవడం లేదని. నా గడ్డం చూసి, "అదేంటి డాక్టర్ అంటే గడ్డం ఉండకూడదు" అని బోడి సలహాలిచ్చిన వారు ఉన్నారు. క్లీన్ షేవ్ ఉంటేనే డాక్టర్ అనుకుంటారట. నాకు గడ్డం లైట్ గా పెంచటం ఇష్టం అని చెబుతుంటాను. ఇంకా ఎక్కువ మాట్లాడితే "నా గడ్డం నా యిష్టం" అని కూడా చెప్పాల్సొస్తుంటుంది ఒక్కోసారి. ఆసుపత్రిలో మా హెచ్వోడీ నన్ను రోజూ తిట్టేవాడు. కారణం గడ్డం ఉందని. గడ్డం తీయడం, నీట్ షేవ్ చేయడమే డాక్టరు వృత్తి ప్రధాన కర్తవ్యం అన్నట్టు ఉండేది. మొన్నొక పేషంటు వచ్చి, ఇంకో డాక్టరు గురించి చెబుతూ , ఆ డాక్టరు గారి పొట్ట, పొట్ట మీద షర్ట్ పొడుచుకురావడం వలన కనిపించిన లోపలి బనియన్ చూశాక, ఎందుకనో ఆ డాక్టరు డాక్టరులాగా కనిపించలేదట. అందుకే ఆయన దెగ్గర ఆపరేషన్ చేయించుకోలేదట. వేరే డాక్టర్ దగ్గర ఆపరేషన్ చేయించుకున్నాడట. మనసులో అనుకున్న "ఆపరేషన్ చేసిన డాక్టర్ అండర్ వేర్ చూసుంటే ఏమయేవాడివో" అని. ఇటువంటి ఎక్ట్రీమ్ డాక్టర్ స్టీరియో టైపులు చూసినపుడు, మనమెంత బానిసలమో అనిపిస్తూ ఉంటుంది.

Comments
Post a Comment