Essay...konni vichitraluntay
కొన్ని విచిత్రాలు ఉంటాయ్.
ఈ మధ్య కొంతమంది విచిత్రంగా ఆలోచించడం మొదలు పెట్టారేమో అనిపిస్తూ ఉంటుంది.
మేం చిన్నపుడు చదివిన స్కూలు హాస్టల్ లో ఒక వంట వాడు ఉండేవాడు. ఈ రోజు వంట బాగాలేదని అతడితో చెబితే, "రోజూ బాగానే ఉంటుందిగా, ఈ రోజు కూడా అలాగే బాగానే ఉందని మనసులో అనుకుంటూ తినేయండి" అని చెప్పేవాడు. బాగా లేకున్నా , మనసులో 'బాగుంది... బాగుంది" అని అనుకుంటూ ఉంటే ఆ వంట రుచిగా ఐపోతుందా?. కాదు కదా!. కానీ అతడు పాపం ఆరోజుకి అలా కానిచ్చేసేవాడు. ఎపుడైనా రసంలో ఏ పురుగో పడిందని చెబితే "పురుగును చూశారు కాబట్టి తినబుద్ధి కాదు, చూడకుంటే తినేసేవారే కదా. ఇపుడు కుాడా అటువంటిదేదీ పడలేదు అని మనసులో అనుకుంటూ లాగించేసేయండి" అనేవాడు. ఇపుడు మన దేశంలో కొందరి పరిస్థితి ఇలాగే ఉంటుంది. అది కూడా కొన్ని సెలెక్టెడ్ విషయాలకే ఉంటుంది. దేశంలో ఏ అన్యాయం జరిగినా, కుల కుమ్ములాటలు జరిగినా, అవన్నీ పట్టించుకోకూడదు అనేలా మాట్లాడేస్తుంటారు. "భారతదేశంలో ఎన్నో కులాలున్నాయి, ఏం అవన్నీ ఎప్పటినుండో కలిషే (చాగంటి స్టైల్) ఉంటున్నాయ్ గా..ఏదో ఎక్కడో ఒక గొడవ జరిగితే ఇంత రాద్దాంతం చేయాలా?" అనేది వీరి ధోరణి. భారతదేశంలో కులాలు ఎపుడు కలిసున్నాయి, ఎవరి పెండ్లి వారే చేసుకుంటారు,ఎవరి వీధిలో వారే ఉంటారు అని మనం ఏమైనా కాస్త మూలాల్లోకి పోయామంటే, వీరు వేరే దేశాల సమస్యలూ, అంతర్యుద్ధాలూ పట్టుకొస్తారు. ఆ దేశాలకంటే మనదేశం చాలా గొప్పది సుమా..! అనేది వీరి లాజిక్. ఎట్లా తిరిగి వారికి భారత దేశం పరమ పవిత్రమైనది. ఇక్కడ ఎటువంటి అన్యాయాలూ జరగవు. దానికి సపోర్ట్ గా పలానా విదేశీ వాడు, (అమెరికా వాడో, జర్మనీ వాడో,) "ఇదిగో భారతదేశం గురించి ఇంత గొప్పగా అన్నాడు!!!!!" అని ఒక గూగుల్ కార్డు ఎత్తుకొచ్చి చూపిస్తారు. ఇపుడున్న సమస్య మీద, మనం ఉటంకించిన సమస్య మీద తప్ప మిగితావి ఏవేవో మాట్లాడేస్తూ ఉంటారు.
ఇక ఇటువంటి వారిలో విపరీత ధోరణులు ఉన్నవారి తరీఖా ఇంకో రకంగా ఉంటుంది. మన దేశంలో పలానా చోట పలానా అన్యాయం జరిగింది అని చెప్పగానే మనల్ని దేశ ద్రోహులుగా చిత్రించేస్తూ ఉంటారు. దేశం గురించిన చెడుని అసలు బయటకు చెప్పకూడదుట. చెబితే గొడవలు పెరిగిపోతాయట. నిరంతరం మన దేశం అంత పొడూ,ఇంత పొడూ, అంత తురుం, ఇంత తురం, అంత తోపు, ఇంత తోపు అని చెప్పుకోవడమే దేశభక్తి తప్ప ఇంకేదీ కాదంటారు. మనదేశ సమస్యను చర్చించటం, దానిని బయటకు తీసుకురావటం ఎట్లా దేశ ద్రోహం అవుతుందో మనకు అర్థం కాదు. దేశంలో జరిగిన తప్పుని ఎత్తి చూపడమే దేశ ద్రోహం అన్నట్టుగా మాట్లాడేస్తుంటారు. ఇలా మాట్లాడేవారు గనక అధికార పార్టీ వర్గపు సానుభూతి పరులైతే, మనం వారికి వెంటనే కమ్యూనిష్టులమైపోతుంటాం. అంటే దేశంలో ఉండే సమస్యలపై కమ్యూనిష్టులు తప్ప వేరేవారు మట్లాడటం లేదని వారే ఒప్పుకుంటున్నట్టా?. అంటే ఈ దేశంలో కమ్యూనిస్టులూ, బీజేపీ వారు తప్ప ఇంకొకరు లేరా?. కమ్యూనిస్టు పార్టీవారికి కూడా ఇది ఆనందదాయకమైన విషయమే ఒకరకంగా. దేశంలో నిజంగా ఇంతమంది కమ్యూనిస్టులు ఉన్నట్టైతే వారెపుడో అధికారం లోకి వచ్చేసే వారు. ఫండమెంటలిస్టులు, కమ్యూనిస్టులూ రెండు రకాలయితే ప్రజాస్వామిక వాదులు ఉంటారనీ వీరు గుర్తించరు. వీరి ఫండమెంటల్ భావజాలాలను ప్రశ్నించే వారు అందరూ కమ్యూనిస్టులే అని అనుకుంటూ ఉంటారు. పార్టీలకు సంబంధం లేకుండా, భావజాలాలకు సంబంధం లేకుండా సాటి మనిషిగా ఒక వ్యక్తి స్పందించగలడు అని వీరు ఎరుగరు.
ఇక మోడీ గవర్నమెంటునుగానీ, మోడీని కానీ విమర్శించే వారందరూ యాంటీ హిందూనే అంటూంటారు వీరు. ఆయనేం చేసినా విమర్శించకూడదు. ఆయన చేసే గొప్ప పనులు అర్థం కాక మనం అజ్ఞానంతో విమర్శిస్తున్నాం అంటూంటారు. సరే ఆ గొప్పేదో విడమర్చి చెప్పమంటే మాత్రం చెప్పలేరు. ఫక్తు వ్యక్తి పూజతో ఉబ్బిపోవం తప్ప వీరిలో ఇంకో గుణమంటూ కనిపించదు. మోడీ వంటి దేశ భక్తుడు ఇంకొకరు లేడంటారు. మంచిదే కదా...నిఖార్సయిన దేశభక్తి తో ఒక వ్యక్తి దేశ ప్రధాని కావడం మంచిదే. కానీ ఆయన ఏం చేసినా పొగడాల్సిందే అంటే ఎట్లా?.అదేం మెంటాలిటీ? అదేం బానిసత్వం?. డీమోనైజేషన్ ను పిచ్చి చర్య అని అన్నామే అనుకోండి, వెను వెంటనే మనం పాకిస్థాన్ ఏజెంటు ఐపోతుంటాం ఇటువంటి వారి దృష్టిలో. జీఎస్టీ వలన కామన్ మ్యాన్ కి ఇద్బందులొచ్చేస్తాయి అంటే, మనల్ని పాకిస్థాన్ కి పొమ్మంటుంటారు. ఇదేం లాజిక్కో అర్థం కాదు. ఇటువంటి వారిని చూసినపుడు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక రాచరిక వ్యవస్థలో ఉన్నామా అనిపిస్తూ ఉంటుంది. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి?, ప్రజాస్వామ్య విలువలు అంటే ఏమిటి? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం నిర్వహించే పాత్ర ఏమిటి? ప్రజాస్వామ్యంలో 'డిఫెరెన్స్ ఆఫ్ ఒపీనీయన్' అంటే ఏమిటి?. దానిని గౌరవించడం వలన ఒనగూరే లాభం ఏమిటి?. చర్చ అంటే ఏమిటి?. ఇత్యాది బేసిక్ నాలెడ్జి వీరిలో కొరవడి ఉంటుందేమో. పిల్లలకు స్కూలులో అలాగే ఇంట్లో ఇటువంటి భావనలను వాటి ప్రాముఖ్యతను చిన్నప్పటినుండే బోధించాల్సిన అవసరం ఉంది. కనీసం సమీప భవిష్యత్తులో ఐనా మన ఆటవిక సమాజం, ఇంటెలెక్చువల్ సమాజానికి ఎదగగలగాలంటే ప్రజాస్వామ్య విలువలనూ వాటి చుట్టూ పరుచుకుని ఉన్న వైవిధ్యభరిత సహ జీవన పరిస్థితులనూ చిన్నప్పటినుంచే నాటాల్సిన అవసరం ఉంది. మల్టీ కల్చరిజం స్థాయికి ఇతర దేశాలు ఎదిగుతుంటే, మనమింకా పురాతన భావజాలాలవైపు నడవడం తీవ్రంగా ఆలోచించి తక్షణ చర్పను చేపట్టవలసిన అంశం అనిపిస్తూంది.
16/8/17

Comments
Post a Comment